యాచకులకు షెల్టర్స్
TG: HYDలోని యాచకులకు షెల్టర్ హోమ్స్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. నిన్న జీహెచ్‌ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో బెగ్గర్స్ రిహాబిలిటేషన్ కల్పించారు. నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్టేషన్లు, ప్రధాన చౌరస్తాలు, దేవాలయ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 107 మంది యాచకులను గుర్తించారు. మిగతా వారికి కౌన్సెలింగ్ ఇచ్చి స్వస్థలాలకు పంపించారు.