VIDEO: ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక
PPM: సంగం వలసలో శ్రీ సీతారామ కళ్యాణం కనుల పండుగగా జరిగింది. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. పండితుల మంత్రోచ్చారణల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. మంగళవాయిద్యాలు, వేద ఘోషలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి పరిసర గ్రామాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.