కారు ప్రమాదం.. 43 గొర్రెలు మృతి
BPT: పర్చూరు సమీపంలోని దేవరపల్లి అడ్డరోడ్డు వద్ద ఇవాళ తెల్లవారుజామున వేగంగా వచ్చిన కారు గొర్రెల మందను ఢీకొట్టింది. దీంతో 43 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటనలో కారు బోల్తాపడగా, డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.