ఎస్సైని సన్మానించిన కాంగ్రెస్ శ్రేణులు

ఎస్సైని సన్మానించిన కాంగ్రెస్ శ్రేణులు

GDWL: ఇటిక్యాల మండలంలో శాంతిభద్రతలు కాపాడి ఫ్రెండ్‌లి పోలీస్ వ్యవస్థ నెలకొల్పాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రుక్మానందరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎస్సై రవిని కాంగ్రెస్ శ్రేణులతో ఆదివారం కలిసి శాలువా పూలమాలతో సన్మానించారు. మండలంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా, ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా అవగాహన కల్పించాలన్నారు.