'పెన్షనర్స్ వాలిడేషన్ బిల్లు రద్దు చేయాలి'
SKLM: పార్లమెంటులో ప్రవేశపెట్టిన పెన్షనర్స్ వ్యాలిడేషన్ బిల్లును రద్దు చేయాలని ఫారం ఆఫ్ పెన్షనర్స్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆవరణలో శుక్రవారం నిరసన తెలియజేశారు. యూనియన్ నాయకులు ప్రసాద్ రావు, చంద్రశేఖర్ మాట్లాడుతూ.. బిల్లు తక్షణం ఉపసంహరించుకోవాలన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయాలన్నారు.