భారత సరిహద్దులో పాక్ డ్రోన్లు కలకలం

భారత సరిహద్దులో పాక్ డ్రోన్లు కలకలం

భారత సరిహద్దులో పాక్ డ్రోన్లు కలకలం రేపాయి. LOC ప్రాంతాల్లో పాక్ డ్రోన్లు సంచరించటాన్ని BSF బలగాలు గుర్తించాయి. బాలాకోట్, లంగోట్, గురుసాయి నాలా ప్రాంతంలో పాక్ డ్రోన్ కదలికలను గుర్తించినట్లు బలగాలు తెలిపాయి. అర్థరాత్రి తర్వాత పాక్ భూభాగం నుంచి 6 డ్రోన్లు వచ్చి ఐదు నిమిషాల పాటు చక్కర్లు కొట్టి తిరిగి వెళ్లినట్లు వెల్లడించాయి. దీనిపై ఉన్నతాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు.