కార్తీక పౌర్ణమికి ఏర్పాట్లు పూర్తి
MNCL: దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట సత్య సత్యనారాయణ స్వామి వారి దేవాలయం కార్తీక పౌర్ణమి వేడుకకు సిద్ధమైంది. బుధవారం కార్తీక పౌర్ణమి కావడంతో ఆ దేవాలయంతో పాటు అనుబంధ దేవాలయాలను అధికారులు రంగురంగుల బల్బులతో ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ ప్రాంతాల నుండి వేలాదిమంది భక్తులు తరలివచ్చి స్థానిక గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి దేవాలయంలో పూజలు చేయనున్నారు.