రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

GNTR: చేబ్రోలు మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ మరమ్మతులలో భాగంగా శనివారం విద్యుత్ నిలిపివేయనున్నట్లు AE శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. చేబ్రోలు, వడ్లమూడిలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, నారాకోడూరు, గుండవరం, గొడవర్రు, వేజెండ్ల, శుద్ధపల్లిలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ ఉండదన్నారు. వినియోగదారులు గమనించి అధికారులకు సహకరించాలని కోరారు.