పేరుకే గొప్ప.. ఫలితం శూన్యం

NLR: కావలి పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో అభివృద్ధి పనుల పేరుతో లక్షల రూపాయలు ఖర్చు చేసినా, ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఆసుపత్రికి ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు, ఉదయగిరి వంతెన కూడలిలోని దుకాణాల అద్దెల ద్వారా నెలకు రూ.1.5 లక్షల ఆదాయం వస్తున్నా, ఖర్చుల్లో పారదర్శకత లేకపోవడం గమనార్హం. బోరు, పైపులు, మరుగుదొడ్ల సామగ్రి, ఏసీల ఏర్పాటులో లోపాలు బయటపడుతున్నాయి.