పెయింటర్ కార్మికుల భవన నిర్మాణానికి భూమి పూజ
CTR: కుప్పంలో శ్రీ వినాయక పెయింటర్ వర్కర్స్ సంఘం వారికి కేటాయించిన ప్రభుత్వ స్థలంలో నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ భూమి పూజ నిర్వహించారు. ఈ భవనం పూర్తి అయితే పెయింటర్ కార్మికులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి కార్మికుడికి అండగా ప్రభుత్వం ఉందని చెప్పడానికి ఇది ఒక మంచి నిదర్శనమని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.