కలెక‍్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌కు 313 వినతులు

కలెక‍్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌కు 313 వినతులు

VSP: సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్‌కు ప్రజల నుంచి 313 వినతులు అందాయని కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ తెలిపారు. వీటిలో రెవెన్యూ విభాగానికి సంబంధించి 130, జీవీఎంసీకి 82, పోలీసు విభాగానికి 15, ఇతర విభాగాలకు 86 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు ఫిర్యాదులను వెంటనే ఆన్‌లైన్‌లో పరిశీలించి, నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు.