ఐదు రోజుల పని దినాలకై బ్యాంకు ఉద్యోగుల గర్జన

ఐదు రోజుల పని దినాలకై బ్యాంకు ఉద్యోగుల గర్జన

SRPT: వారానికి ఐదు రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో బ్యాంకు ఉద్యోగులు కదం తొక్కారు. పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం కేవలం హామీలతో కాలయాపన చేస్తూ తమను వంచిస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు ధ్వజమెత్తారు. అనంతరం బ్యాంకు ముందు నిరసన తెలిపారు.