VIDEO: కంటిలో కారం కొట్టి పుస్తెల తాడు చోరీ
PPM: వీరఘట్టం మండలంలో ఓ దుండగుడు వృద్ధరాలి కంటిలో కారం కొట్టి బంగారు పుస్తెల తాడు మాయం చేశాడు. స్థానికులు వివరాలు ప్రకారం.. పాలమెట్ట గ్రామానికి చెందిన అన్నపూర్ణమ్మ పొలంలో పనులు చేస్తున్న కుటుంబ సభ్యులకు భోజనాన్ని తీసుకెళ్లుతుండగా పక్కనుంచే వచ్చిన ఓ దుండగుడు ఆమె కంటిలో కారం కొట్టి మెడలోని సుమారు 2 తులాల పుస్తెలతాడు దొంగలించినట్లు వారు తెలిపారు.