శ్రీనగర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్

శ్రీనగర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్

దేశంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలపై కేంద్రం ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. శ్రీనగర్ కేంద్రంగా సాగుతున్న లష్కరే తోయిబా అంతర్రాష్ట్ర ఉగ్రవాద నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించారు. శ్రీనగర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు పాకిస్తానీయులు ఉన్నారని పోలీసులు తెలిపారు. లష్కర్-ఏ-తోయిబాకు చెందిన ఉగ్రవాదులుగా వెల్లడించారు.