రహదారి మరమ్మత్తులు చేపట్టిన కౌన్సిలర్

VZM: నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి ఏడో వార్డు రైల్వే బ్రిడ్జి వద్ద రోడ్డు గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో నెల్లిమర్ల - రణస్థలం రహదారిలో రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యను గ్రహించిన కౌన్సిలర్, బీజేపీ మండల అధ్యక్షులు మైపాడ ప్రసాద్ జేసీబీ ఏర్పాటు చేసి రహదారిపై నిలిచిపోయిన నీటిని మళ్లించారు.