VIDEO: దావులూరుపాలెంలో అగ్ని ప్రమాదం
GNTR: కొల్లిపర మండలం దావులూరుపాలెంలో గురువారం తెల్లవారుజామున పూరిల్లు దగ్ధమైంది. వేములకొండ మంగమ్మ తన పిల్లలతో ఇంట్లో నిద్రిస్తుండగా మంటలు రావడంతో, కట్టుబట్టలతో బయటకు పరుగున వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా కాలిపోయి, భారీ ఆస్తి నష్టం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు.