రాష్ట్రస్థాయి సీఎం కప్‌కు హైందవి ఎంపిక
MDCL: హరిపురి కాలనీకి చెందిన SR స్కూల్ 8వ తరగతి విద్యార్థిని తిప్పాన హైందవి సీఎం కప్-2026 క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచింది. బాలికల అండర్-14, అండర్-16 విభాగాల్లో జరిగిన 600 మీటర్ల పరుగుపందెంలో అద్భుతంగా రాణించి 2 బంగారు పతకాలు సాధించింది. ఈ ఘనతతో హనుమకొండలో జరిగే రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలకు ఎంపికైంది.