నార్వేలోని యూఎస్‌ ఎంబసీ సమీపంలో పేలుడు

నార్వేలోని యూఎస్‌ ఎంబసీ సమీపంలో పేలుడు

నార్వే రాజధాని ఓస్లోలోని అమెరికా ఎంబసీ సమీపంలో పేలుడు చోటుచేసుకుంది. దీంతో భారీ శబ్దం వినిపించినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన జరిగింది. అయితే ఈ పేలుడులో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. పేలుడు ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇరాన్‌పై యుద్ధం నేపథ్యంలో అమెరికా తన రాయబార కార్యాలయాల వద్ద భద్రతను పెంచింది.