ఉపాధ్యాయుడికి ఎమ్మెల్యే ప్రశంసా
SRD: నిజాంపేట మండలం ర్యాలమడుగు హైస్కూల్‌కు చెందిన ఉపాధ్యాయుడు వినయ్ కుమార్ గత మూడు రోజులు పాటు ఖేడ్‌లో జరిగిన జిల్లా విద్యా వైజ్ఞానిక సదస్సు ఉపాధ్యాయ విభాగంలో అద్భుతంగా ప్రదర్శించారు. దాంతో ఈ విభాగంలో ప్రథమ స్థానం పొంది, రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. గురువారం ముగింపు రోజు స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఈయనను అభినందించి ప్రశంసా పత్రం జ్ఞాపికను అందజేశారు.