గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యం: ఎమ్మెల్యే సామేలు

మోత్కూరు: గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. శనివారం పాటిమట్ల గ్రామంలో రూ.5 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అనంతరం ఆరోగ్య ఉప కేంద్రానికి శంకుస్థాపన చేశారు.