'క్రమశిక్షణతో చదివి 100% ఉత్తీర్ణత సాధించాలి'
ASF: కౌటాల మండలం కేంద్రంలోని ZPSS పాఠశాలను జిల్లా కలెక్టర్ హరిత మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల గదులు, హాజరు పట్టికను పరిశీలించారు. పదవ తరగతి విద్యార్థులు రాబోయే పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమవ్వాలని, క్రమశిక్షణతో చదివి 100% ఉత్తీర్ణత సాధించాలన్నారు. పరీక్షల సమయంలో ఆహార నియమాలు పాటించాలి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు.