నందికోట్కూరులో పీ.వీ. రావు జయంతి వేడుకలు

నందికోట్కూరులో పీ.వీ. రావు జయంతి వేడుకలు

NDL: నందికోట్కూరు పట్టణంలోని మాల మహానాడు కార్యాలయంలో పీ.వీ. రావు 73వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. నాయకులు అచ్చు గట్ల నగేష్, మనోహర్ పీ.వీ. రావు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన చేసిన త్యాగాలు స్మరించుకొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ, మండల, పట్టణ అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.