వరద ముప్పు.. మూటాముళ్లే సర్దుకొని పయనం

ELR: కుక్కునూరు, వేలేరుపాడు ఏజెన్సీ మండలాల్లో గోదావరి వరద ఉధృతి పెరగడంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. కలెక్టర్ వెట్రిసెల్వి పరిస్థితిని పరిశీలిస్తూ, ముంపు ప్రభావిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రేపాకుగోమ్ము గ్రామంలో నిర్వాసితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.