ప్రజలు వాగులోకి వెళ్లొద్దు.. పోలీస్ శాఖ

ప్రజలు వాగులోకి వెళ్లొద్దు.. పోలీస్ శాఖ

BHPL: టేకుమట్ల మండల ప్రజలు వాగులోకి ప్రవేశించరాదని రెవెన్యూ, పోలీస్ శాఖలు శనివారం ఉదయం హెచ్చరిక జారీ చేశాయి. వాగులోకి వెళ్లడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అనుమతి లేకుండా ప్రవేశిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.