దేవాదాయ శాఖ అధికారి నివాసంలో ఏసీబీ సోదాలు

దేవాదాయ శాఖ అధికారి నివాసంలో ఏసీబీ సోదాలు

GNTR: తాడేపల్లిలోని రాష్ట్ర దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి నివాసంలో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ స్రవంతి నేతృత్వంలో 25 మంది అధికారులు శాంతి నివాసంతో పాటు విజయవాడలో తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నట్లు, తనిఖీలు పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.