ఈనెల 23న జిల్లాకు మందకృష్ణ మాదిగ రాక

KMR: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఈనెల 23న బీర్కూర్ రానున్నారు. దత్త ఫంక్షన్ హాల్లో జరిగే ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని కామారెడ్డి జిల్లా దివ్యాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు కుమ్మరి సాయిలు తెలిపారు. ఈ కార్యక్రమానికి బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల పెన్షన్‌దారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.