సీఎంఆర్ ధాన్యం సకాలంలో సమర్పించాలి: అదనపు కలెక్టర్
వనపర్తి జిల్లాలో డిఫాల్టర్ జాబితాలో ఉన్న రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి బకాయి ఉన్న సీఎంఆర్‌తో పాటు పెనాల్టీ చెల్లిస్తే కొత్త ధాన్యం పొందవచ్చని అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్ సూచించారు. శుక్రవారం అదనపు కలెక్టర్ తన చాంబర్లో రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎంఆర్ రూపంలో బియ్యం సకాలంలో సమర్పించాలన్నారు.