'రహదారి మరమ్మతులు చేయండి'

'రహదారి మరమ్మతులు చేయండి'

వనపర్తి పురపాలక సంఘంలో విలీనమైన మెట్టుపల్లి గ్రామం వద్ద రహదారి తీవ్రంగా దెబ్బతింది. కొల్లాపూర్ వైపు వెళ్లే ఈ మార్గంలో వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో గుంతలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రోడ్డు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.