హర్మూజ్ నుంచి వెళ్లే నౌకలకు టోల్‌ఛార్జ్!
హర్మూన్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. ఇకపై ఈ జలసంధి నుంచి నౌకలు ప్రయాణించాలంటే టోల్ ఫీజు విధించాలని టెహ్రాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నౌకాయానం, ఇంధన రవాణా, ఆహార సరఫరా కోసం జలసంధిని వినియోగించాలంటే ఆయా దేశాలు టోల్, ట్యాక్స్ కట్టేలా ఒక బిల్లును తీసుకురావాలని ఇరాన్ యోచిస్తున్నట్లు ఆ దేశ ఎంపీ తెలిపారు. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే నౌకల బుకింగ్ ధరలు పెరగనున్నాయి.