'బాల్య వివాహాలను అరికట్టాలి'
NLG: బాల్య వివాహాలను అరికట్టే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కట్టంగూర్ మండలంలోని మునుకుంట్ల సర్పంచ్ నరేశ్ అన్నారు. గురువారం గ్రామం లోని పాఠశాలలో ఐసీడీఎస్, బాలల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బాలల చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాల్య వివాహాల వల్ల బాలికలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారని తెలిపారు.