VIDEO: నందిగామలో 40 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత
NTR: నందిగామ నియోజకవర్గంలో మంగళవారం ఎండలు తీవ్రంగా మండాయి. నందిగామలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ నమోదుకాగా, కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో 38 నుంచి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరిగిన ఎండ వేడిమితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అన్నారు.