చినభోగిలలో 104 వైద్య సేవలు
PPM: సీతానగరం మండలం చినభోగిలలో డాక్టర్ ఉషారాణి ఆధ్వర్యంలో గురువారం 104 వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 45 మందికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా నెలకు సరిపడా మందులు పంపిణీ చేశారు. హీమోగ్లోబిన్ శాతం తక్కువ ఉన్న గర్భిణులకు ఐరన్ టాబ్లెట్లు ఇచ్చారు. గర్భిణీలకు మెరుగైన ఆరోగ్య సూత్రాలు గురించి వివరించి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.