రైతులకు శుభవార్త.. ఆ భూములకు విముక్తి
PLD: ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. నిషేధిత జాబితా నుంచి గ్రామ సేవా ఇనాం భూములకు ప్రభుత్వం విముక్తి కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా 1,36024.38 ఎకరాల భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్లపై ఉన్న నిషేధం ఎత్తివేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి, ఫ్రీ హోల్డ్ చేయాలని ఈనెల 8న CM చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.