గణపవరం తిరిగి ఏలూరు జిల్లాలోకి..!
ELR: ఒక నియోజకవర్గం ఒకే డివిజన్‌లో ఉంచాలన్న ప్రభుత్వం నిర్ణయం ఇప్పడు గణపవరం మండల ప్రజలను కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ నిర్ణయం అమలైతే ఆ మండలం ఏలూరు జిల్లాలో కలిసే అవకాశముంది. గత ప్రభుత్వంలో ఉంగుటూరు నియోజకవర్గం ఏలూరులో కలిసినా గణపవరంను భీమవరం రెవెన్యూ డివిజన్లో ఉంచేశారు. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయంతో వారు మళ్లీ ఆందోళనలు చేపడుతున్నారు.