ACB వలలో రూ. 100 కోట్ల అవినీతి తిమింగలం
HYD: అక్రమాస్తుల కేసులో RR జిల్లా ల్యాండ్ రికార్డు AD శ్రీనివాస్‌ను ACB అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విచారణ చేపట్టగా తప్పుడు సర్వే నెంబర్లతో ప్రభుత్వ భూములను ప్రైవేటుకు కట్టబెట్టి రూ.100 కోట్ల ఆస్తులను సంపాదించినట్లు తెలింది. గతంలో ఆయన మీద ACB కేసు నమోదు అవ్వడంతో కొంత కాలం సస్పెన్షన్‌లో ఉండి తిరిగి విధుల్లో చేరారని, అయినా తన పద్ధతి మార్చుకోలేదని తెలిపారు.