ఇచ్చిన మాట నిలబెట్టుకున్నజిల్లా టీడీపీ అధ్యక్షుడు
KDP: పెద్దముడియం మండలం పాలూరులోని ఓ ప్రాంగణానికి కాంపౌండ్ గోడను జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి తన సొంత నిధులతో నిర్మించారు. గ్రామంలోని ఎస్సీ వాసులు, స్థానిక నాయకుల అభ్యర్థన మేరకు ఈ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా భూపేశ్ రెడ్డి గ్రామంలోని చర్చీని ఆదివారం సందర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.