VIDEO: ఆటో-టిప్పర్ ఢీ.. ఇద్దరు మృతి
GDWL: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వడ్డేపల్లి మండలం జులేకల్ స్టేజీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. స్థానికుల వివరాలు.. రాజోలి మండలం పచ్చర్లకు చెందిన మార్క్(18), మరో 12 ఏళ్ల బాలుడితో కలిసి టమాటాలు అమ్మడానికి శాంతినగర్‌కు ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన టిప్పర్ ఆటోను ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.