తణుకు మారథాన్ విజయవంతం చేయండి: ఎమ్మెల్యే
W.G: తణుకు రోడ్డు రన్ పేరుతో ఈనెల 7న నిర్వహించనున్న మారథాన్ విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు. గురువారం తణుకులో మారథాన్ సంబంధించి టీ షర్టు, మెడల్ ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, సినీ నటి రాయల్ రాజ్ పుత్ పాల్గొంటారన్నారు.