'భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

TPT: భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గూడూరు డీఎస్పీ శ్రీ గీతా కుమారి సూచించారు. బుధవారం మాట్లాడుతూ.. ఉరుములు, మెరుపులు, కారణంగా పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు ఆరుబయట ఉండకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. అలాగే కరెంటు పోల్స్ సమీపంలో ఉండకూడదన్నారు. అలాగే సెల్‌ఫోన్ మాట్లాడుతూ.. ప్రయాణాలు చేయవద్దని ఆమె సూచించారు.