VIDEO: రైల్వే స్టేషన్‌లో డ్రగ్స్ కంట్రోల్ టీమ్ తనిఖీలు

WGL: మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా బుధవారం వరంగల్ రైల్వే స్టేషన్‌లో డ్రగ్స్ కంట్రోల్ టీమ్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. జాగిలాలతో అనుమానిత వ్యక్తులతో పాటు వారి బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయించినా, వినియోగించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని డ్రగ్స్ కంట్రోల్ టీమ్ ఇన్స్‌పెక్టర్ సతీశ్ సూచించారు.