దారుణ ఘటన.. టాయిలెట్ ఫ్లష్ లో శిశువు

దారుణ ఘటన.. టాయిలెట్ ఫ్లష్ లో శిశువు

HYD: కూకట్‌పల్లిలో ఓ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని మహిళ అప్పుడే పుట్టిన శిశువును ఓపీడీ టాయిలెట్‌లోని ఫ్లష్ ట్యాంక్‌లో వదిలివెళ్లింది. ఆసుపత్రి వర్గాల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని, త్వరలోనే నిందితులను గుర్తిస్తామని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.