ఇంట్లో శవం.. బాధ్యతగా ఓటు

ఇంట్లో శవం.. బాధ్యతగా ఓటు

VKB: రెండో విడత ఎన్నికల్లో మోమిన్‌పేట్ మండలం ఎన్కతలలో సందనెల్లి బాలమ్మ మృతి చెందింది. అయితే, కుటుంబ సభ్యులు ఓటు వేసి వచ్చి అంత్యక్రియలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో శవం ఉన్నప్పటికీ ముందుగా ఓటు వేసి వచ్చారు. ఎన్నికలు ఎంతో ముఖ్యమని, అందుకే ముందుగా ఓటు వేసి వచ్చామని మృతురాలి బంధువులు తెలిపారు. దీంతో ఓటు హక్కు ప్రాధాన్యతను చాటిచెప్పారని గ్రామస్థులు అనుకుంటున్నారు.