'కుందాలపల్లి ఘటనపై తప్పుడు నివేదిక'

'కుందాలపల్లి ఘటనపై తప్పుడు నివేదిక'

కోనసీమ: పి.గన్నవరం మండలం కుందాలపల్లి అట్రాసిటీ ఘటనపై జిల్లా కలెక్టర్ జాతీయ ఎస్సీ కమిషన్‌కు తప్పుడు నివేదిక పంపారని మాజీ ఎంపీ హర్ష కుమార్ తనయుడు జీవీ సుందర్ ఆరోపించారు. ఈ సందర్భంగా అమలాపురంలో ఆయన కార్యాలయంలో శుక్రవారం మాట్లాడుతూ కలెక్టర్, ఎస్పీ కనీసం ఆ ప్రాంతాన్ని సందర్శించలేదని అన్నారు. బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.