సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
AKP: రాంబిల్లి మండలంలో ఈనెల 23న మెగా సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్‌కు భూమి పూజ చేసేందుకు సీఎం చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ విజయ కృష్ణన్, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శనివారం పర్యవేక్షించారు. 15వేల మంది సీఎం సభకు ప్రజలు హాజరుకానున్నట్లు కలెక్టర్ తెలిపారు. వీరికి భద్రత రవాణా విద్యుత్ తాగునీరు సౌకర్యాన్ని కల్పించాలని ఆదేశించారు.