కోమరోలులో ఎస్సై వాహన తనిఖీలు

ప్రకాశం: కోమరోలు ఎస్సై నాగరాజు తాటిచెర్ల సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం వాహన తనిఖీలు నిర్వహించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్రమ మద్యం, గంజాయి, సమాజానికి హాని కలిగించే ఇతర వస్తువులు తరలింపును అరికట్టే అంశంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వాహన తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.