ఆప్కో గోదాంను పరిశీలించిన మంత్రి

ఆప్కో గోదాంను పరిశీలించిన మంత్రి

సత్యసాయి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని యర్రబాలెంలో ఉన్న ఆప్కో గోదాంను రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియాతో కలిసి మంత్రి సవిత గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా గోదాంలో ఉన్న స్టాక్ వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. పాత స్టాక్‌తో తయారు చేస్తున్న ఫ్రాగ్‌లను, బ్యాగులను ఆమె పరిశీలించారు.