800 లీటర్ల బెల్లపు ఊటలు ధ్వంసం

800 లీటర్ల బెల్లపు ఊటలు ధ్వంసం

SKLM: నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా మందస మండలం కొండలోగాం పంచాయతీలో ఎక్సైజ్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 800 లీటర్ల బెల్లపు ఊటలు, 20 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేసినట్లు సోంపేట ఎక్సైజ్ సీఐ కె బేబీ తెలిపారు. అదేవిధంగా బుడార్సింగి గ్రామ సమీపాన ఓ బైక్, 20 లీటర్ల నాటుసారాను సీజ్ చేసి వ్యక్తిని అరెస్టు చేసినట్లు మీడియాకు తెలియపరిచారు.