జిల్లాలో పలువురు ఎస్సైల బదిలీ
ఏలూరు జిల్లాలో పలువురు ఎస్సైలు బదిలీ అయ్యారు. వీరిలో క్రాంతిప్రియ పీసీఆర్, ఎస్.రామకృష్ణ డీసీఆర్బీ నుంచి ఏలూరు వన్ టౌన్, దుర్గాప్రసాద్ ఏలూరు వన్ టౌన్ నుంచి ట్రాన్స్‌కో, పవన్ కుమార్ పోలవరం నుంచి కలిదిండి, వల్లి పద్మ సైబర్ సెల్ నుంచి తడికలపూడి, చెన్నారావు తడికలపూడి నుంచి బుట్టాయిగూడెం, దేవసుధ డీసీఆర్బీ నుంచి ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు.