వ్యవసాయ శాఖ అధికారులకు సహకరించిన పోలీసులు

BDK: ఇల్లందు నియోజకవర్గం బయ్యారంలో రైతు వేదిక వద్ద శుక్రవారం వ్యవసాయ అధికారుల కొరత నెలకొంది. కారణంగా రైతులకు సకాలంలో ఏరియా అందించలేకపోవడం తో రైతుల ఇబ్బందులను గుర్తించిన పోలీస్ కానిస్టేబుల్ దినేష్, రజిని స్వచ్ఛందంగా సహకరించి వ్యవసాయ సిబ్బందికి తోడ్పాటుగా నిలిచారు. అనంతరం సమయానికి రైతులకు యూరియా అందించడంలో సహకరించారు.