జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం

జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం

మేడ్చల్ జిల్లాలోని 3 మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అధికారులు 303 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసినట్లు ప్రకటించారు. ఎన్నికలు ఎలాంటి అంతరాయం లేకుండా జరిగే విధంగా 13 మంది నోడల్ అధికారులు ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షిస్తున్నారు. శిక్షణ, రవాణా, మీడియా బాధ్యతలు ఒక్కో అధికారికి అప్పగించారు.